ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే..అతి ఆక‌లి ప‌రార్‌!

అతి ఆక‌లి.ఇదేం అనుకున్నంత చిన్న స‌మ‌స్య కాదు.

అతి ఆక‌లి కార‌ణంగా ఏ ఆహారాల‌ను ప‌డితే ఆ ఆహారాల‌ను, ఏ స‌మ‌యంలో ప‌డితే ఆ స‌మ‌యంలో లాగించేస్తుంటారు.

దాంతో బ‌రువు పెరిగ‌డం మాత్ర‌మే కాదు మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెర‌గ‌డం, ర‌క్త‌పోటు ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందు వ‌ల్ల‌నే అతి ఆక‌లిని నివారించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే అందుకు కొన్ని కొన్ని ఫుడ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఫుడ్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.బంగాళ‌దుంప‌లు అతి ఆక‌లికి చెక్ పెట్ట‌డంలో ఎఫెక్టివ్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Advertisement

ఉడికించిన బంగాళ దుంప‌ల‌ను తీసుకుంటే ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దాంతో వేరే ఆహారాల‌పై దృష్టి మ‌ల్ల‌కుండా ఉంటుంది.అతి ఆక‌లిని త‌గ్గించ‌డంలో డార్క్ చాక్లెట్స్ కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.

ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే ఆకలిని కలిగించే హార్మోన్‌లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి.పైగా డార్క్ చాక్లెట్ ను డైట్‌లో చేర్చుకుంటే బ్రెయిన్ షార్ప్‌గా, హార్ట్ హెల్తీగా, మూడ్ ఉత్సాహంగా మార‌తాయి.

అలాగే అతి ఆక‌లిని నివారించ‌డంలో సూప్‌లు కూడా సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.చికెన్ సూప్‌, పెప్ప‌ర్ సూప్‌, కార్న్ సూప్‌, వెజిటేబుల్ సూప్, మ‌ష్రూమ్ సూప్‌ త‌దిత‌ర వాటిని ఎంపిక చేసుకుని తీసుకుంట అతి ఆక‌లి ప‌రార్ అవుతుంది.పైగా సూప్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

ఆక‌లిని అరిక‌ట్ట‌డంలో ఎగ్స్ కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.రెగ్యుల‌ర్‌గా ఒక‌టి లేదా రెండు ఉడికించిన‌ గుడ్లు తీసుకుంటేశ‌రీరానికి ప్రోటీన్ తో పాటు అనేక పోష‌కాలు పుష్క‌లంగా అందుతాయి.దాంతో ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇక న‌ట్స్‌, పాలు, పెరుగు, ప‌న్నీర్‌, చేప‌లు, పండ్లు వంటివి తీసుకోవ‌డం ద్వారా అతి ఆక‌లికి దూరంగా ఉండొచ్చు.

Advertisement

తాజా వార్తలు