ఇవి మీ డైట్‌లో ఉంటే వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌వ‌ట‌.. తెలుసా?

వ‌య‌సు పైబ‌డినా య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, న‌ల‌బై ఏళ్లు దాటాయంటే చాలు.

వృద్ధాప్య ఛాయ‌లు వేధిస్తూ ఉంటాయి.ముఖ్యంగా ముడ‌త‌లు, మ‌చ్చ‌లు, స‌న్న‌ని చార‌లు, చ‌ర్మం పొడి బార‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

దాంతో వీటిని నివారించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ ప్యాకులు ఇలా ఎన్నో వాడుతుంటారు.కానీ, తీసుకునే ఆహ‌రం బ‌ట్టీ కూడా వృద్ధాప్య ఛాయ‌లకు దూరంగా ఉండొచ్చు.

అవును, కొన్ని కొన్ని ఆహారాలు వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా చేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ట‌మాటారుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి మ‌రియు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది.వారంలో ఒక‌టి, రెండు సార్లు ట‌మాటా జ్యూస్ రూపంలో తీసుకుంటే అందులో ఉండే లైకోపీన్ అనే కంటెంట్ చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

టమాటాతో పాటు క్యారెట్, బీట్‌రూట్‌, కీర దోస‌కాయ‌, పాల‌కూర‌, బచ్చలికూర, మెంతికూర వంటివి కూడా డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, ఇవి కూడా చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌టంతో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే వృద్ధాప్య ఛాయ‌లు రానివ్వ‌కుండా చేయ‌డంలో అవకాడో పండు కూడా అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.రెగ్యుల‌ర్‌గా ఒక అవ‌కాడో పండును తీసుకుంటేఅందులో ఉండే విట‌మిన్స్‌, మినిర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మ అందాన్ని సంరక్షిస్తాయి.ముడ‌త‌లు, మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.

గ్రీన్ టీ.బ‌రువు త‌గ్గ‌డానికే కాదు చ‌ర్మాన్ని నిత్య‌య‌వ్వ‌నంగా ఉంచ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డండి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

స్ప్రౌట్స్ కూడా చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి.రెగ్యుల‌ర్‌గా స్ప్రౌట్స్ తీసుకుంటే అనేక జ‌బ్బ‌లతో పాటుగా వృద్ధాప్య ఛాయ‌ల‌కు కూడా దూరంగా ఉండొచ్చు.

Advertisement

ఈ ఫుడ్స్‌తో పాటు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌రియు కంటి నిండా నిద్ర‌పోవాలి.

తాజా వార్తలు