FDలపై 8 శాతం వడ్డీలను అందిస్తున్న బ్యాంకులు ఇవే… వెంటనే త్వరపడండి!

FD (ఫిక్స్డ్ డిపాజిట్) చేయడం అనేది మనిషి దైనందిత జీవితంలో ఓ భాగం అయిపోయింది.

భవిష్యత్ అవసరాల నిమిత్తం మనలో అనేకమంది బ్యాంక్‌లో FD రూపంలో డబ్బులు దాచుకోవాలని అనుకుంటూ వుంటారు.

అయితే కొంతమందికి ఈ విషయంలో పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో FD చేసేస్తూ వుంటారు.దాని వలన వారు డబ్బులు అయితే దాచుకోగలరు గానీ వడ్డీ విషయంలో మాత్రం వారికి పెద్దగా కలిసి రాదు.

ఈ నేపథ్యంలో అలా FD చేయాలనుకునేవారు ముందుగా ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో చెక్ చేసుకోవాలి.

అవును, తెలివైనవారు ఎక్కువ వడ్డీ అందించే బ్యాంక్‌లోనే FD చేస్తారు.ఇప్పుడు అలా FDలపైన జనాలకి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకుందాం.ఇక్కడ పేర్కొన్ని బ్యాంక్స్ 8 శాతానికి పైగా వడ్డీ ఇస్తున్నాయి.ముందుగా ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ విషయానికొస్తే సీనియర్ సిటిజన్స్‌కు 8.01 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.2 ఏళ్ల నుంచి 30 నెలల వరకు టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.ఇక ప్రభుత్వ రంగానికి చెందిన PNB (పంజాబ్ నేషనల్ బ్యాంక్) సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు 8.05 శాతం వడ్డీని ఇస్తోంది.

Advertisement

ఆ తరువాత IDFC బ్యాంక్ కూడా 8 శాతం వడ్డీ రేటును అందించడం విశేషం.సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ వడ్డీ వర్తిస్తుంది.కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈమధ్య కాలంలో పెంచుకుంటూ పోతుండటాన్ని మనం గమనించవచ్చు.

అంతే కాకుండా రానున్న కాలంలో కూడా రెపో రేటు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పైకి చేరుతాయని అంచనాకు రావొచ్చు.

ఇదే జరిగితే డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది.

వాటే ఐడియా : ఇక పై ఇంటికి వచ్చి పెంపుడు జంతువులను..?!

Advertisement

తాజా వార్తలు