Mohan Babu : మోహన్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న మోహన్ బాబు ( Mohan Babu ).

మొదట్లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

అయితే మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత హీరోగా మారి వరుస సినిమా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక అలాంటి మోహన్ బాబు ఇప్పుడు సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు పొందటానికి కొంతమంది డైరెక్టర్లు బాగా హెల్ప్ చేశారు.వాళ్ళు చేసిన సినిమాలతో భారీ హిట్లు అందుకున్న మోహన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.ఇక అందులో ముఖ్యంగా డైరెక్టర్ బి గోపాల్ ( Director B Gopal )మోహన్ బాబు కి మంచి విజయాలను అందించాడు.

Advertisement

అసెంబ్లీ రౌడీ, అడవిలో అన్న, కలెక్టర్ గారు లాంటి సినిమాలతో మోహన్ బాబుని స్టార్ హీరోని చేశాడు.ఇక రాఘవేంద్రరావు ( Raghavendra Rao )కూడా అల్లుడు గారు, మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలతో మోహన్ బాబుకి భారీ సక్సెస్ లను అందించాడు.

రవి రాజా పినిశెట్టి( Ravi Raja Pinishetti ) కూడా మోహన్ బాబుకి పెదరాయుడు లాంటి ఒక ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ సక్సెస్ ని అందించి మోహన్ బాబు స్టార్ హీరో అవ్వడానికి తను కూడా చాలా హెల్ప్ చేశాడనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది దర్శకులు కూడా మోహన్ బాబుని స్టార్ హీరోని చేయడానికి హెల్ప్ చేశారు.అయినప్పటికీ ముఖ్యంగా వీళ్లు మాత్రం వరుస సినిమాలను చేసి మంచి విజయాలను అందించడమే కాకుండా ఆయన్ని స్టార్ హీరోగా మార్చడంలో చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు