BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Supreme Court Will Hear The Case Of Brs Mlc Kavitha Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలో పిటిషన్ ను జస్టిస్ బేటా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్( Justice Pankaj Mittal ) ధర్మాసనం విచారించనుంది.సీఆర్పీసీ నిబంధనల ప్రకారం( CRPC Rules ) విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు.

కాగా ఏడాది కాలంగా కవిత కేసు సుప్రీంకోర్టు( Supreme Courtt )లో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో ఈడీ, సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు అవుతున్నారు.

ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై రేపు సుప్రీంకోర్టులో విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube