కొర్రలను ఆహారం లో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

శరీరానికి శక్తితో పాటు వివిధ రకాల పోషకాలను కూడా కొర్రలు( Foxtail millet ) అందిస్తాయి.

ప్రస్తుత సమాజంలో కొర్రలను చాలామంది ప్రజలు ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు.

కొర్రలు తినడం ద్వారా లభించే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడం వలన పోషక విలువలు తగ్గిపోతాయి.

దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇటువంటి సమస్యలు అధికమించాలి అంటే కొర్రలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కొర్ర బియ్యాన్ని కూడా వరి బియ్యం వండుకున్నట్లుగానే వండుకోవచ్చు.అయితే కొర్రలు తరచూ తింటూ ఉండడం వలన అధిక బరువు కూడా తగ్గవచ్చు.

Advertisement

కొర్రలు తీపి, వగరు రుచిని కలిగిస్తాయి.అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) కూడా అధికంగా ఉంటాయి.అది మాత్రమే కాకుండా కొర్రల్లో అధిక పీచు పదార్థం, మాంసం, కృతులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్ లాంటి ఎన్నో అనేక ఖనిజాలు కూడా ఉంటాయి.

ఇక చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఇది మంచి ఆహారంగా పెట్టవచ్చు.ఇక ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.ఇక కడుపు నొప్పి (Abdominal pain ) మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలకు కూడా కొర్రలతో చెక్ పెట్టవచ్చు.

వీటిలో చాలా ఫైబర్ ఉండడం వలన ఇది డైజేషన్ కి కూడా చాలా ముఖ్యమైనది.

ఈ బియ్యం తినే బదులు కొర్రలు తింటే మంచి ఎనర్జీ కూడా వస్తుంది.100 గ్రాముల కొర్రలు తినగా 10 నుంచి 11 గ్రాముల వరకు ప్రోటీన్స్ పొందవచ్చు.ఇది బ్రెయిన్ హెల్త్ కు కూడా ఉపయోగపడుతుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

ఇందులో బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇది ఆక్సిజన్ కెపాసిటీనీ కూడా పెంచుతుంది.

Advertisement

కొర్రలను ఆహారంలో చేర్చుకోవడం వలన నాడీ బలహీనత( Nerve Weakness )ను కూడా అధికమించవచ్చు.నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపెట్టే విటమిన్ ఇందులో ఉంటుంది.

ఇలాంటి కండిషన్ లేకుండా పెద్దవాళ్ళు అలాగే చిన్నవాళ్ళు ఎవరైనా కూడా వీటిని తినవచ్చు.

తాజా వార్తలు