ఖమ్మంలో వాహనాలను ఎక్కడా అడ్డుకోలేదని సీపీ విష్ణు వారియర్ తెలిపారు.కాంగ్రెస్ నిర్వహిస్తున్న తెలంగాణ జన గర్జన సభకు వెళ్లకుండా వెహికల్స్ అడ్డుకుంటున్నారన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.
జిల్లాలో ట్రాఫిక్ డైవర్షన్ మినహా ఎక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.