హీరోల కంటే సామాన్యులకే ఎక్కువగా యూజ్ అయిన డైలాగ్స్.. ఏవంటే...??

సాధారణంగా తెలుగు సినిమాల్లోని పాటలు, డైలాగులు, బీజీఎంలు బాగా వైరల్ అవుతుంటాయి.వీటి వల్ల సినిమా హీరోలకు బాగా క్రేజ్ వస్తుంది.

వీటిని కారణంగా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.కొన్ని సినిమాలలోని డైలాగ్స్, బీజీఎంలు అనేవి హీరోల కంటే సామాన్యులకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి.

సామాన్యులు అవి వాడిసుకుంటూ నిజ జీవితంలో బాగా ప్రయోజనాలు పొందారు.వారెవరో, వారికి ఏ డైలాగులు, బీజీఎంలు బాగా యూజ్ అయ్యాయో తెలుసుకుందాం పదండి.

• పుష్ప - తగ్గేదేలే

సుకుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఫిలిం పుష్ప( Pushpa ) సినిమాలో అల్లు అర్జున్( Allu Arjun ) లారీ డ్రైవర్ గా, కూలిగా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సిండికేట్ గా కనిపించాడు.ఒక మాస్ క్యారెక్టర్ లో మాస్ స్టైల్ డైలాగులు చెబుతూ అల్లు అర్జున్ మంటలు పుట్టించాడు అతడు చెప్పిన తగ్గేదేలే( Thaggedele ) డైలాగు సూపర్ హైలైట్ అయింది.

Advertisement

అయితే ఇదే డైలాగ్‌ను బిగ్ బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ చాలా ఎక్కువసార్లు వాడేసాడు.తగ్గేదే లే అంటూ బిగ్ బాస్ వరకు వెళ్ళాడు.

ఆ షోలో కూడా బాగా డైలాగ్‌ వాడేస్తూ చివరికి విన్నర్ అయ్యాడు.

• అయ్యగారే నంబర్ వన్

అఖిల్( Akhil ) సినిమా రిలీజ్ అంటే చాలు. అయ్యగారే నంబర్ వన్…’( Ayyagare No.1 ) అంటూ ఓ అభిమాని చాలా రచ్చ చేస్తూ అక్కినేని అఖిల్ తో సమానంగా పాపులర్ అయ్యాడు.ఇతని అసలు పేరు నాగరాజు.

( Nagaraju ) గుంటూరుకు చెందిన నాగరాజు అయ్యగారే నంబర్ వన్ అనే డైలాగు బాగా వాడేస్తూ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు.అతడి మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

• సుడిగాలి సుధీర్ - బ్రూస్ లీ బీజీఎం

బ్రూస్లీ సినిమాలో( Bruce Lee Movie ) చిరంజీవి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక అద్భుతమైన బీజీఎం వస్తుంది.స్టార్ స్టార్ అంటూ మధ్యలో ఒక వాయిస్ ఓవర్ కూడా వస్తుంది.ఇది వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి.

Advertisement

అయితే దీని వల్ల చిరంజీవి( Chiranjeevi ) కంటే ఎక్కువగా సుడిగాలి సుధీర్ కే( Sudigali Sudheer ) ఉపయోగపడింది.ఈ సంగీతం వినిపిస్తే చిరంజీవి కంటే సుధీరే ఎక్కువగా గుర్తు వస్తారంటే అతిశయోక్తి కాదు.

సుధీర్ ఈ సౌండ్ ను వీడు ప్రోగ్రామ్స్ లో తన ఎంట్రీ మ్యూజిక్ గా వాడుకున్నాడు.

తాజా వార్తలు