ప్రస్తుతం లేఆఫ్ సీజన్ మొదలైంది.రాబోయే సంవత్సరాలలో మరిన్ని తొలగింపులు వుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇలాంటి పరిస్థితులలో కూడా భారతదేశంలో చాలా కంపెనీలు నియామకాలు జరపడం విశేషం.Naukri.com యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయా ఏం చెబుతున్నారంటే గత 3 నెలల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న IT రంగం ఫిబ్రవరిలో 10% వృద్ధిని కనబరిచిందని చెప్పుకొచ్చాడు.
అయితే, డేటా సైంటిస్ట్‌లు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్లకు డిమాండ్ అంతగా పెరగలేదు.
ఇకపోతే పెద్ద ఎత్తున కొత్త రిక్రూట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న టాప్ టెక్ సంస్థలు గురించి ఇక్కడ చూద్దాం.అకౌంటింగ్ మరియు కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి "ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియా" వచ్చే ఐదేళ్లలో 30,000 మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.ఈ కంపెనీ భారతదేశంలో అసోసియేట్స్ నుండి మేనేజర్ పాత్రల వరకు వివిధ స్థాయిలలో ఉద్యోగాల నియామకం చేస్తోంది.
అదే విధంగా ఇన్ఫోసిస్‌లో 4,263 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ ప్రకారం తెలుస్తోంది.
అదే విధంగా విమానాల మానవ వనరుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎయిర్ ఇండియా ఈ సంవత్సరం 900 మంది కొత్త పైలట్లను మరియు 4,000 మంది క్యాబిన్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది.విప్రోకు భారతదేశంలో 3,292 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా లింక్డ్ఇన్ తెలిపింది.ఇంజనీరింగ్ – సాఫ్ట్వేర్, IT సమాచార భద్రత వంటి విభాగాల్లో రిక్రూట్ చేయనుంది.
ఈ విషయమై విప్రో అధికారిక కెరీర్ సైట్ ఓ ప్రకటనలో పేర్కొంటూ.నిరంతర అభివృద్ధే ధ్యేయంగా రాబోయే సంవత్సరాలలో మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని పేర్కొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy