తెలంగాణలో ఈనెల 13న జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్ష వాయిదా పడింది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు 10వ తేదీ లోపు తదుపరి పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.అదేవిధంగా ఈనెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగతాయని ప్రకటించారు.







