లేఆఫ్ సీజన్లో కూడా రిక్రూట్‌ చేసుకుంటున్న 5 కార్పొరేట్ కంపెనీలు ఇవే!

ప్రస్తుతం లేఆఫ్ సీజన్ మొదలైంది.రాబోయే సంవత్సరాలలో మరిన్ని తొలగింపులు వుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 These 5 Companies Recruiting Employees In Lay Off Season Details, Layoff Seasons-TeluguStop.com

ఇలాంటి పరిస్థితులలో కూడా భారతదేశంలో చాలా కంపెనీలు నియామకాలు జరపడం విశేషం.Naukri.com యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయా ఏం చెబుతున్నారంటే గత 3 నెలల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న IT రంగం ఫిబ్రవరిలో 10% వృద్ధిని కనబరిచిందని చెప్పుకొచ్చాడు.

అయితే, డేటా సైంటిస్ట్‌లు మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకు డిమాండ్ అంతగా పెరగలేదు.

ఇకపోతే పెద్ద ఎత్తున కొత్త రిక్రూట్‌మెంట్‌ల కోసం ఎదురు చూస్తున్న టాప్ టెక్ సంస్థలు గురించి ఇక్కడ చూద్దాం.అకౌంటింగ్ మరియు కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి “ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియా” వచ్చే ఐదేళ్లలో 30,000 మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.ఈ కంపెనీ భారతదేశంలో అసోసియేట్స్ నుండి మేనేజర్ పాత్రల వరకు వివిధ స్థాయిలలో ఉద్యోగాల నియామకం చేస్తోంది.

అదే విధంగా ఇన్ఫోసిస్‌లో 4,263 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్ ప్రకారం తెలుస్తోంది.

అదే విధంగా విమానాల మానవ వనరుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎయిర్ ఇండియా ఈ సంవత్సరం 900 మంది కొత్త పైలట్‌లను మరియు 4,000 మంది క్యాబిన్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది.విప్రోకు భారతదేశంలో 3,292 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా లింక్డ్‌ఇన్ తెలిపింది.ఇంజనీరింగ్ – సాఫ్ట్‌వేర్, IT సమాచార భద్రత వంటి విభాగాల్లో రిక్రూట్ చేయనుంది.

ఈ విషయమై విప్రో అధికారిక కెరీర్ సైట్ ఓ ప్రకటనలో పేర్కొంటూ… నిరంతర అభివృద్ధే ధ్యేయంగా రాబోయే సంవత్సరాలలో మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube