మానవుని హుందాతనాన్ని పెంచేది ఒక టైలర్ మాత్రమే...మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: సమాజంలోని మానవుని ఉందాతనాన్ని పెంచేది ఒక టైలర్ కు మాత్రమే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

మంగళవారం అంతర్జాతీయ టైలర్స్ డే ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో నిర్వహించిన టైలర్స్ డే లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మనం లక్ష రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కున్న దానిని తీర్చిదిద్ది మనకు సరిపడా బట్టల్ని కుట్టి మన హుందాతనాన్ని పెంచడంలో టైలర్ల పాత్ర మరువలేనిదన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతిగా ఉన్నారని,అందులో భాగంగా టైలర్లకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.త్వరలో నియోజకవర్గంలో మీరు భవనం టైలర్ మీటింగ్ హాల్ కు నిర్మాణానికి కృషి చేయునట్లు హామీ ఇచ్చారు.

There Is Only One Tailor Who Can Improve Human Dignity Minister Jagadish Reddy ,

టైలర్లకు ఇస్త్రికి ఉచిత కరెంటు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందని,త్వరలో దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.సమావేశ ప్రారంభానికి ముందు సూర్యపేట టైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం నగేష్ నేత ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ నుండి శంకర విలాస్ చౌరస్తా మీదుగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టైలర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఉన్న రమేష్, బండపల్లి పాండురంగ చారి,కర్నే ఉపేందర్, శ్రీనివాస్,గట్ల సిద్ధప్ప,గట్ల జగదీష్,కృష్ణ,రాజ లింగయ్య,జానయ్య తదితరు పాల్గొన్నారు.

Advertisement
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

Latest Suryapet News