మణిపూర్ లో గందరగోళ పరిస్థితులున్నాయి..: ఖర్గే

మణిపూర్ లో ప్రస్తుతం గందర గోళ పరిస్థితులు ఉన్నాయని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు.భారత కూటమి ఎంపీలు మణిపుర్ ప్రజల సమస్యలు విన్నారన్నారు.

సుమారు యాభై వేల మందికిపైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని చెప్పారు.మణిపుర్ లో ఆర్థిక కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయని తెలిపారు.

ఇంత జరుగుతున్నా మణిపూర్ లో మోదీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.వర్గాల మధ్య విభేదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

ఎన్నికల ర్యాలీలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీకి సమయం ఉంటుంది.కానీ మణిపూర్ సమస్య పరిష్కారానికి మాత్రం మోదీకి సమయం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

పార్లమెంట్ లో మణిపూర్ పై మోదీ సమగ్ర ప్రకటన చేయలేదని మండిపడ్డారు.ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు