ఆధార్‌ కార్డు అడ్రస్‌ ప్రూఫ్‌లో భారీ మార్పులు.. ఇక తప్పనిసరిగా..!

ఆధార్‌ కార్డ్‌ దేశవ్యాప్తంగా ఎంతో కీలకమైంది.భారతీయులకు ఇది ఓ ఐడెంటిటీని ఇస్తుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా చాలా ముఖ్యం.ప్రతి డాక్యుమెంట్‌కు ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే ఏ లబ్ధి పొందలే ము.అందుకే ఆధార్‌ కార్డుకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది.గతంలో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అ«థారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏ) ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పునకు ఏ ప్రూఫ్‌ అవసరం లేదని తెలిపింది.

కానీ, తాజాగా ట్వీట్టర్‌ వేదికగా ఈ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.యూఐడీఏలో చోటుచేసుకున్న ఈ భారీ మార్పులతో అడ్రస్‌ మార్ప చేసుకోవాలనుకుంటున్న ఆధార్‌ కార్డు హోల్డర్స్‌ ఈ కొత్త నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరచిన ఏవైనా 32 డాక్యుమెంట్లను తప్పకుండా అడ్రస్‌ ప్రూఫ్‌గా సమర్పించాలని యూఐడీఏఐ తెలిపింది.దీనికి మీ ఆధార్‌ కార్డు అప్డేడ్‌ చేసింది ఉండాలి.దీంతో ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా మార్పు చేసుకోవచ్చు.

Advertisement

ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్డేట్‌ చేసుకునే విధానం.

ఆధార్‌ కార్డు సర్వీస్‌ సెల్ఫ అప్డేట్‌ పోర్టల్‌ అయిన –ssup.uidai.gov.in/ssup/ మీ వివరాలతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ‘ప్రోసీడ్‌ టూ అప్డేట్‌ ఆధార్‌’ డ్రాప్‌ డౌన్‌ మెనూలో సెలెక్ట్‌ చేయాలి.యూఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

క్యాప్చా టైప్‌ చేసిన తర్వాత ‘సెండ్‌ ఓటీపీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

దాన్ని నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి.అందులో మీ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Advertisement

అక్కడ జాబితాలో పొందుపరచిన 32 డాక్యుమెంట్లలో ఏదైన ఒకటి అడ్రస్‌ ప్రూఫ్‌గా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు