నాటు నాటు సాంగ్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేసిన యువతి.. ఆనంద్ మహీంద్రా ఫిదా!

ఆర్‌ఆర్ఆర్( RRR ) సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ పాట మ్యూజిక్, లిరిక్స్, రామ్ చరణ్, తారక్ డ్యాన్స్‌లతో చాలామందిని ఉర్రూతలూగించింది.

మొత్తానికి ఈ గొప్ప పాట ఆస్కార్ అవార్డు( Oscar Award )ను గెలుచుకుంది.ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు దాని మాస్ బీట్‌లకు స్టెప్‌లు వేస్తున్నారు.

ఆస్కార్ విన్ అయిన సమయం నుంచి ఈ పాట మరింత హిట్ గా మారింది.ఇప్పుడు అందరు ప్రజలు దీనికి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.

ఈ క్రమంలోనే తోలుబొమ్మతో కలిసి ఒక మారియోనెటిస్ట్ ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఆ మారియోనెటిస్ట్ డ్యాన్స్‌కి ఫిదా అయ్యారు.ఆపై ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Advertisement

ఈ వీడియోలో జింక తల కలిగిన తోలుబొమ్మ ఒక పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది.ఆ తోలుబొమ్మను కర్రలు, తీగలతో యువతి చాలా చక్కగా ఆడించింది.

చూసేందుకు తోలుబొమ్మకి ప్రాణం వచ్చి అది డ్యాన్స్ చేసినట్లు అనిపించింది.ఆ బొమ్మ డాన్స్ మూవ్స్ అచ్చం ఒరిజినల్ సాంగ్ మూవ్స్‌ లాగానే అనిపించాయి.

MM కీరవాణి లిరికల్ కంపోజిషన్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లచే హై ఎనర్జీ రెండిషన్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, చంద్రబోస్ సాహిత్యంతో నాటు నాటు పాట ఒక మాస్టర్ పీస్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగణ్ ఆర్‌ఆర్ఆర్‌లో నటించారు.ఇకపోతే టెస్లా కార్లు న్యూజెర్సీలో ఈ పాటకు పెర్ఫార్మన్స్ చేసి ఆశ్చర్యపరిచాయి.

టెస్లా సీఈఓ అయిన ఎలోన్ మస్క్ కూడా పెర్ఫార్మన్స్ ఇష్టపడ్డారు.

వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు
Advertisement

తాజా వార్తలు