తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణా ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా ఎందుకంటే కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మరీ ముందస్తు బరిలోకి దిగాడు.అదే సమయంలో కాంగ్రెస్ తెలివిగా కేసీఆర్ ని వ్యతిరేకించే బీజేపీ మినహా
అన్ని పార్టీలతో జట్టుకట్టింది.
దాంతో కేసీఆర్ గెలుపు ఎంతో కష్టం అంటూ ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి.కేసీఆర్ కి కూటమి దెబ్బ గట్టిగానే తగులుతుంది అంటూ వార్తలు ఊపండుకున్నాయి.
కొన్ని సర్వేలు సైతం టీఆర్ఎస్ గెలుపు డౌటే అంటూ సర్వే రిపోర్ట్ లు కూడా ఇచ్చాయి.అయితే ఈ విషయాలు ఏవీకూడా కేసీఆర్ లెక్కలోకి తీసుకోలేదు, గెలుపుపై ఎప్పుడూ ధీమాగానే ఉన్నారు.
అయితే కేసీఆర్ వ్యూహం మొత్తం ఆ ఒక్క స్థానంపైనే కేంద్రీకరించారని తెలుస్తోంది.అదేంటంటే.

వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి ని ఓటమి పాలు చేసి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలనేది కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోందని విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు.అందుకు తాజాగా జరుగుతున్నా పరిణామాలు నిదర్శనమని అంటున్నారు…రేవంత్ ని ఓడించాలనే ఆలోచనని బలమైన టార్గెట్ చేసుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగా ఏ నియోజకవర్గానికి వెచ్చించని విధంగా దాదాపు ౩౦౦ కోట్లతో అభివృద్ధి పనులు చేయించారని తెలుస్తోంది.అంతేకాదు
రేవంత్ ని ఓడించడానికి కేసీఆర్ మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేంద్ర రెడ్డి ని రంగంలోకి దింపడమే కాకుండా నరేంద్ర రెడ్డి గెలుపు భాద్యతని మేనల్లుడు హరీష్ రావుకి అప్పగించారట దాంతో హరీష్ తనదైన శైలిలో ప్రచారం చేపట్టడమే కాకుండా ఇంటింటికి తిరిగి వారి వారి సమస్యల్ని తెలుసుకునే విధంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేశారట.ప్రభుత్వ పరంగా కాని మరే ఇతర సాయాలు కావాలన్నా వెనువెంటనే పరిష్కరిస్తున్నారని తెలుస్తోంది.
దాంతో రేవంత్ రెడ్డి ఒకింత ఆందోళనకి లోనవుతున్నాట్టుగా కూడా తెలుస్తోందట.అందుకే రేవంత్

ఈ మధ్యకాలంలో తన కొడంగల్ కోటకి బీటలు పడకుండా తన వాఖ్ చాతుర్యంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలని తనవైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.ఇదిలాఉంటే చంద్రబాబు కుప్పం, వైయస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల, ఎలాగో నాకు కొడంగల్ అలాంటిది అనే చెప్తూనే తనలో ఉన్న ఓటమి భయం బయట పెట్టుకుంటున్నారట.అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ లో 100 కోట్లు ఖర్చు చేసైనా సరే గెలుపు కోసం పోరాడాలని భావిస్తుండటంతో రేవంత్ మరింత ఆందోళనకి లోనవుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు.
మరి ఈ బిగ్ ఫైట్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.