30 ఏళ్లుగా నీటిలోనే ఆ గ్రామం.. ఎట్టకేలకు బయటపడింది.. ఎలా ఉందో తెలిస్తే!

ఒక గ్రామం గత మూడు దశాబ్దాలుగా నీటిలోనే ఉండిపోయింది.ఆ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయిందని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

అదెక్కడుంది? దాని విశేషాలు ఏంటి అని తెలుసుకోవడానికి  చాలామంది ఆరా తీస్తున్నారు.మరి ఆ వండర్ విలేజ్ గురించి మనమూ తెలుసుకుందామా! స్పెయిన్ దేశంలో అసెరెడో (Aceredo) అనే గ్రామం ఉంది.

అన్ని గ్రామాల లాగానే ఇందులో ఇళ్లను నిర్మించుకొని వందల మంది ప్రజలు నివసించేవారు.ఎక్కువగా రైతులు ఇక్కడ జీవించారు.

వీరు రాళ్లతో చెక్కుచెదరని ఇళ్లను నిర్మించుకున్నారు.అయితే ఎంతో సంతోషంగా జీవిస్తున్న ప్రజలను ఉన్నపళంగా గ్రామం ఖాళీ చేయాల్సిందిగా అక్కడి అధికారులు ఆదేశించారు.

Advertisement

రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో గ్రామస్తులు అక్కడి నుంచి తరలి వెళ్లి పోవాల్సి వచ్చింది.

ఆ తరువాత అక్కడే ఉన్న పోర్చుగీసు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఫ్లడ్ గేట్స్ మూసివేశారు.దాంతో లిమియా అనే నది వేరే వైపు ప్రవహించకుండా.రిజర్వాయర్ వైపు పోటెత్తింది.దాంతో అసెరెడో గ్రామం నీట మునిగింది.1992 కాలంలో గ్రామం మొత్తం నీటిలో నిమర్జనం  అయ్యింది.అప్పట్నుంచి ఈ గ్రామం ప్రపంచానికి కనిపించకుండా 30 ఏళ్లుగా నీటిలోనే ఉండిపోయింది.

అయితే తాజాగా రిజర్వాయర్ లోని నీళ్లు బాగా ఇంకిపోవడం తో.అసెరెడో గ్రామం వెలుగులోకి వచ్చింది.అయితే అప్పటి ఇళ్లను చూసి స్థానికులు అబ్బుర పడుతున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ గ్రామంలో ఇనుముతో తయారుచేసిన తలుపులు, గేట్లు బాగా తుప్పుపట్టిపోయి కనిపిస్తున్నాయి.అక్కడ నీటి స్థాయి పూర్తిగా తగ్గడంతో చాలామంది గ్రామంలోకి వెళ్లి మరీ దృశ్యాలను వీక్షిస్తున్నారు.వదిలేసిన కార్లు, ప్రజలు వాడి పడేసిన వస్తువులు, బల్లలు, డ్రమ్ములు ఇలా అనేక వస్తువులు స్థానికులను ఆకర్షిస్తున్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

హాలీవుడ్ హారర్ సినిమాల్లోని లొకేషన్ లాగానే అసెరెడో గ్రామం కనిపిస్తుంది అంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.అవి కాస్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు