వీడియో వైరల్: బంగారం షాపులో తెగబడ్డ దొంగలు.. వ్యక్తి మృతి..

తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని రాజస్థాన్‌ లోని ఖైర్తాల్ తిజారా( Khairtal Tijara in Rajasthan ) జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్‌ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ షాప్( Kamlesh Jewelers Shop ) లో దుండగులు రెచ్చిపోయారు.

కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరుపుకుంటూ బంగారం షాపులోకి వచ్చారు.

అలా వచ్చిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, అలాగే షాపు యజమానిని కొట్టారు.ఈ సమయంలో దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరచడమే కాకుండా.

ఒకరి మరణానికి కారకులయ్యారు.ఈ ఘటనలో షాపులో ఉన్న బంగారం ఆభరణాలను వారు బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి పారిపోయారు.

ఇకపోతే దొంగలు బయటకు పరిగెత్తుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ కాల్పులు( Security guard firing ) చేయడంతో ఎదురు కాల్పులు చేసిన దొంగలు సెక్యూరిటీ గార్డ్, దుకాణంలోని ఓ పని చేసే వ్యక్తిపై, అలాగే జ్యువెలర్స్ షాప్ యజమాని కమలేష్ సోనీ ను దొంగలు తుపాకీతో కాల్చారు.దీంతో బుల్లెట్ దెబ్బలు తిన్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు.అయితే ఈ ఘటనలో షాపు యజమాని కమలేష్ సోనీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

ఘటన సమయంలో షాపులో రికార్డ్ అయిన సిసి కెమెరా ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగినట్లుగా సమాచారం.దొంగలు స్విఫ్ట్ కారులో వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.ఇక దుకాణదారుడు షాపులో దొంగతనం చేస్తున్న సమయంలో అరవడంతో అతనిని తీవ్రంగా కోటి అతనిపై కాల్పులు జరిపారు.

ఇక సమాచారాన్ని అందుకున్న సంఘటన స్థల ఎస్పీ జేష్ట మైత్రి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.జరిగిన సంఘటనకు సంబంధించిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని.

, త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు