వీడియో వైరల్: ఈయన తెలివి చల్లగుండ.. ఇటుకలతో ఎంత బాగా కూలర్ చేశాడో చూడండి..

ప్రస్తుతం వేసవి కాలం( summer season ) నేపథ్యంలో ఎండ నుండి ఉపశమనం పొందేందుకు ఎవరి ప్రయత్నాలు వారు వివిధ రకాలుగా చేస్తున్నారు.

డబ్బులు ఉన్నవారు ఖరీదైన ఏసీలు , అలాగే కూలర్లు కొనడానికి ప్రయత్నిస్తుంటే మరి కొంతమంది డబ్బులు లేనివారు సామాన్య ప్రజలు తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే సరిపెట్టుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో కొందరు వారి తెలివికి పదును పెట్టి కొత్తగా ప్రయోగం చేయడం మొదలుపెట్టారు.ఇందులో భాగంగా కొందరు తమ ఇంటిపై స్ప్రింకర్లను ఏర్పాటు చేసి, మరికొందరు చెడిపోయిన కూలర్లను ఫ్రిడ్జ్ ఎదురుగా ఉంచి తద్వారా చల్లగాలని ఆస్వాదించడం మొదలుపెట్టారు.

ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన వీడియోలో కాస్త బాగానే ఆలోచించి ఇటుకలతో కూలర్ ని తయారు చేసుకోవడం అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.

వైరల్ గా మారిన వీడియోలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందినందుకు ఓ వ్యక్తి తన మెదడుకి పెట్టిన పనికి వచ్చిన ఐడియాతో తన ఇంట్లో చల్లదనం కోసం ఓ చోట ఇటుకలతో నిర్మాణాన్ని మొదలుపెట్టాడు.అచ్చం కూలర్ ఆకారంలో ఇటుకలను ( Bricks )పేర్చి ఫ్యాన్ అందులో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాడు.అలా ఫ్యాన్ ఏర్పాటుచేసి ముందువైపు కూలర్ కు ముందువైపు ఉన్నట్లుగా కాటన్ ను కూడా ఏర్పాటు చేశాడు.

Advertisement

ఇలా ఫైనల్ గా చూస్తే మాత్రం ఇంట్లో ఓ పెద్ద కూలర్ ని అతడు నిర్మించాడు.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు.ఇతడి ఐడియా మామూలుగా లేదు కదా అని కొందరు అంటుంటే మరి కొందరేమో ఇంటిని ఏసీలో మార్చేశాడని అతనిని పొగిడేస్తున్నారు.మరి కొందరేమో ఆ ఇటుకలకు పెట్టే డబ్బులు కాస్త కూలర్ కొంటె సరిపోతుంది కదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు