2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు

కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న ఇండస్ట్రీలలో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి.

ఈ మహమ్మారి దెబ్బకి 2020 లో పెద్దగా సినిమాల విడుదల లేకుండా పోయాయి.

కానీ., 2021 లో కూడా కరోనా క్రైసిస్ ఉన్నా.

, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాయి.మరి.2021లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1) పుష్ప:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప.పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ డాడ్ టాప్ కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టడం విశేషం.ఇక ఫుల్ రన్ లో ఈ ఫిగర్ అమాంతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2.వకీల్ సాబ్:

పవన్ కళ్యాణ్ తెలుగునాట ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి పరిచయం అవసరం లేదు.ఇక పవన్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం 2021 లో 85 కోట్ల వరకు వసూళ్లను సాధించి రెండో స్థానంలో ఉంది.ఒకవేళ కరోనా తీవ్రత లేకుండా ఉండుంటే ఈ ఫిగర్ 100 కోట్లని అందుకుని ఉండేది.

3.అఖండ:

Advertisement

తెలుగు నాట మాస్ హీరో అనే మాటకి నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ.ఇక బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బాక్సాఫీస్ డాడ్ జాతరకి తెర తీసింది.అఖండ ఇప్పటికే రూ.71 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే అఖండ ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది.

4.ఉప్పెన :

2021 లో ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ఉప్పెన.సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన ఈ మూవీ మొత్తం 51 కోట్ల షేర్ వసూలు చేసి., అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

5.క్రాక్:

2020 లో కరోనా దెబ్బ కి కళ తప్పిన ఇండస్ట్రీకి మళ్ళీ ఊపిరి ఊదిన చిత్రం క్రాక్.మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల షేర్ దక్కించుకోవడం విశేషం.

6.జాతి రత్నాలు:

‘జాతి రత్నాలు’.2021లో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన చిత్రం.చిన్న సినిమాగా విడుదలై.పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రూ.38.52 కోట్లు వసూళ్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.

7.లవ్ స్టోరి:

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లవ్ స్టోరీ’.అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35.16 కోట్లు వసూళ్లును మాత్రం సాధించింది.

8.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :

Advertisement

అక్కినేని అఖిల్ కెరీర్ మొదటి బ్రేక్ ఈవెన్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.మొత్తంగా రూ.23.75 కోట్లు వసూళ్లను సాధించిన ఈ మూవీ అఖిల్ కి మొదటి విజయాన్ని కట్టబెట్టింది.

9.శ్యామ్ సింగరాయ్ :

నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శత్వంలో సాయి పల్లవి, కృతి శెట్టి, హీరోయిన్లుగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.ఈ సినిమా ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.కానీ., ఇంకా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఈ లిస్ట్ లో చాలా టాప్ కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

10.రెడ్ :

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయ్యి., ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన మూవీ రెడ్.రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ టోటల్ రన్‌లో రూ.19.79 కోట్ల వసూళ్లును సాధించి ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది.

" autoplay>

తాజా వార్తలు