బ్యాంక్ లో దోపిడికి యత్నించిన దొంగ.. బ్యాంకు సిబ్బందికి ఊహించని షాక్..!

దొంగతనానికి వెళ్లిన వ్యక్తులు కచ్చితంగా దొరికిన కాడికి దోచుకుని అక్కడినుండి పరారీ అవుతారు.ఇక బ్యాంకులలో దోపిడీకి పాల్పడితే లక్షలు లేదా కోట్లల్లో డబ్బులు కాజేస్తారు.

ఈ క్రమంలోనే ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేయాలని ఓ మాస్టర్ ప్లాన్ రచించి చాకచక్యంగా బ్యాంకులోకి చొరబడ్డాడు.అయితే ఎంత గాలించిన బ్యాంకులో ఒక్క చిల్లిగవ్వ కూడా లభించలేదు.

దీంతో ఆ బ్యాంక్ సిబ్బందిని అభినందిస్తూ ఒక నోట్ రాసి ఓ టేబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు.మర్నాడు బ్యాంక్ ఓపెన్ చేసిన సిబ్బంది ఆ నోట్ చూసి షాక్ అయ్యారు.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

Advertisement

వివరాల్లోకెళితే.మంచిర్యాల( manchiryala ) జిల్లా నెన్నెలలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన దొంగ ఘోరంగా విఫలమయ్యాడు.దొంగ ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి.

బ్యాంకు లోపలికి వెళ్లి అన్ని డెస్క్లను ఎంతలా వెతికినా ఒక్క చిల్లిగవ్వ కూడా లభించలేదు.స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన అది జరగలేదు.

మళ్లీ బ్యాంకులో మిగిలి ఉన్న అన్ని భాగాలలో ఎంతలా వెతికినా ఒక్క చిల్లి గవ్వ కూడా దొరకకపోవడంతో బ్యాంక్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు ఒక నోట్ రాసి ఓ టేబుల్ డెస్క్ పై పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

శుక్రవారం ఉదయం బ్యాంకు ఓపెన్ చేసిన సిబ్బంది లోపల తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగిందని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు సిసిటీవీ ఫుటేజీని పరిశీలించి బ్యాంక్ వెనుక వైపు ఉన్న గోడదూకి దొంగ బ్యాంక్ ఆవరణలోకి వచ్చినట్లు గుర్తించారు.ముసుగు ధరించి దోపిడీకి పాల్పడ్డ దొంగ.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు

ఏమి దోచుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు.అయితే ఆ దొంగ నా ఫింగర్ ప్రింట్ కూడా ఉండదు.

Advertisement

గుడ్ బ్యాంక్.నాకు ఒక్క రూపాయి కూడా లభించలేదు దయచేసి నన్ను పట్టుకోవద్దు అంటూ.

బ్యాంక్ సిబ్బందిని అభినందిస్తూ బ్యాంక్ మేనేజర్ టేబుల్ పై ఒక న్యూస్ పేపర్ పై నోట్ రాసి వెళ్లిపోయాడు.

తాజా వార్తలు