బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. ఆత్మహత్య చేసుకున్న అమెరికన్..

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు ఎన్నో నేరాలు జరుగుతూనే ఉంటాయి.అలా జరుగుతున్న నేరాలలో కొన్ని నేరాలు ఇలాంటి నేరాలు కూడా జరుగుతాయా అన్నట్లు ఉంటాయి.

కన్న కొడుకును హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఒక అమెరికా మిలియనీర్ శుక్రవారం అనుమానాస్పదంగా మరణించింది. అమెరికా సుప్రీంకోర్టు ఆమె బెయిల్ రద్దు చేసిన కొన్ని గంటలకే ఆమె తన ఇంట్లో మిగతాజీవిగా కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫార్మా రంగంలో మిలియనీర్ గా ఎదిగిన గిగి జర్డాన 2014లో కన్న కొడుకును హత్య చేసిన కేసులో దోషిగా దర్యాప్తులో తెలిసింది.ఆటిజం వ్యాధితో బాధపడుతున్న తన ఎనిమిదేళ్ల కొడుకుకు మందుల మిశ్రమం ఇచ్చి చంపినట్లు ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు అయింది.

కొడుకుతోపాటు గీగీ కూడా ఆ మందుల మిశ్రమం తాగి ఆత్మహత్యకు యత్నించిందని కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు.ఆత్మహత్య చేసుకోబోతున్న విషయాన్ని ముందుగానే తమ బంధువులకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Advertisement

అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం గీగీ వాదన ను కొట్టి పారేశారు.కొడుకు ఒక వైపు మరణం అంచున ఉండగా అతడి ట్రస్ట్ ఫండ్ నుంచి కొంత డబ్బును తన పేరిట అకౌంట్లో వేసుకున్న విషయాన్ని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చాడు.దీని వల్ల 2020 లో న్యాయస్థానం 18 సంవత్సరల జైలు శిక్ష విధించింది.

ఆ కేసు పై అప్పిలుకు వెళ్లిన ఆమెకు ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది.తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ను రద్దు చేసింది.ఈ క్రమంలోనే ఆమె తన నివాసం లో చనిపోయి ఉండడం వల్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు