భారతీయుడు 3 లో నటించనున్న స్టార్ యాక్టర్... అంచనాలను పెంచుతున్నారుగా...

తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికీ అందులో శంకర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక లెజెండ్రీ దర్శకుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఆయన ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్,రోబో,భారతీయుడు, అపరిచితుడు లాంటి ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.

తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సినిమాలకు భారీ రెస్పాన్స్ దక్కుతుంది.ఒకానొక సమయంలో ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండస్ట్రీ లో మిగతా హీరోలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేయాడానికి భయపడిపోయేవారు.అలాంటి శంకర్ డైరెక్షన్ లో రీసెంట్ గా కమల్ హాసన్ ( Kamal Haasan )హీరోగా వచ్చిన భారతీయుడు 2 సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోయింది.

ఇక దాంతో భారతీయుడు సినిమాని కూడా సెట్స్ మీదకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్( Mohan Lal ) ని కూడా తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

ఒకవేళ మోహన్ లాల్ కనక ఈ సినిమాలో నటిస్తే కమలహాసన్, మోహన్ లాల్ ఇద్దరు యాక్టింగ్ తో ఇరగదీస్తారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఈ విషయం తెలుసుకున్నాక అభిమానుల అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరిపోతాయనే చెప్పాలి.మొత్తానికైతే ఈ సినిమా వల్ల అటు కమల్ హాసన్, ఇటు మోహన్ లాల్ లతో పాటుగా శంకర్ కి కూడా ఒక భారీ సక్సెస్ దక్కుతుంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు