13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

డబ్బింగ్ జానకిగా పాపులర్ అయిన దాసరి జానకి ( Dasari Janaki )తొమ్మిదేళ్లకే స్టేజ్ షోలు ఇవ్వడం ప్రారంభించింది.ఆమె 7వ తరగతి వరకు చదువుకుంది.

 Dubbing Janaki, Who Got Married At The Age Of 13, Can Make A Film With Her Love-TeluguStop.com

అయితే ఆ సమయంలోనే అంటే 13-14 ఏళ్ల సమయంలోనే ఓ అబ్బాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తన ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పిందట.ఆ సమయంలో చాలా పెద్ద గొడవలు జరిగాయని, అప్పుడు జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఒక సినిమా కూడా చేయొచ్చని డబ్బింగ్ జానకి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో ఆమె ప్రేమించింది మరెవరినో కాదు తన భర్త, మిలటరీ ఉద్యోగి రామకృష్ణన్‌ను( Ramakrishnan )! పెద్దలను ఎదిరించి మరీ వీళ్లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

Telugu Love Story, Chennai, Dasari Janaki, Janaki, Harmonist, Peddapur, Ramakris

ఆమె తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ” ప్రేమ దాకా వెళ్లిందని తెలిశాక అప్పట్లో చాలా పెద్ద తగాదాలు అయ్యాయి.పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లాల్సి వచ్చింది.దాంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చా.

మా ఆయన చేయి పట్టుకుని చెన్నైకి( Chennai ) వెళ్ళిపోయాను.చెన్నైలోనే కాపురం పెట్టుకున్నాం.

మా ఆయనకు తెలిసిన రిలేటివ్స్ అక్కడే ఉండేవారు.వాళ్ళింట్లో కొన్ని రోజులు తల దాచుకున్నాం.

కొంచెం సెటిల్ అయిన తర్వాత చిన్న రూమ్ తీసుకుని మా కంటూ సొంత ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాం.మొదట మా నాన్నకి మా ఆయన అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.తర్వాత ఆయనే మా నాన్నకి ప్రియమైన అల్లుడు అయ్యారు.” అని చెప్పుకొచ్చారు.

Telugu Love Story, Chennai, Dasari Janaki, Janaki, Harmonist, Peddapur, Ramakris

పెద్దాపురంలో( Peddapur ) నేను ఒక డ్రామా వేయడానికి వెళ్లాను.అప్పుడే మిలటరీ నుంచి సెలవుల మీద మా ఆయన వచ్చారు.ఆయన హార్మోనిస్టు.హార్మోనియం అద్భుతంగా ప్లై చేస్తారు.అలా ఇద్దరం ఒకే చోట కలవడం, పరిచయం పెరగడం, తర్వాత ప్రేమ పుట్టడం జరిగింది.బాగా అర్థం చేసుకున్నారు.

కలకాలం పాటు ఆయనతో కలిసి ఉండడానికి కూడా ఆయన మంచి మనస్తత్వమే కారణం.ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ భోజనం చేయండి అని అడిగే ఒక మంచి మనస్తత్వం ఉన్న మహోన్నత వ్యక్తి.సరేనా సహాయం కోరితే ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టి హెల్ప్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.” అని జానకి చెప్పుకొచ్చారు.షుగర్ కారణంగా తన భర్త 1997లోనే ఎర్లీగా చనిపోయారని కూడా చెప్పారు.ఈ దంపతులు 1964లో చెన్నై కి వెళ్లారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ప్రస్తుతం వారిద్దరితోనే డబ్బింగ్ జానకి చెన్నైలో నివసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube