వామ్మో: ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్.. ఇక వాటిని కూడా చూడొచ్చు..!

సాంకేతిక అనేది రోజురోజుకూ నూతన పుంతలు తొక్కుతోంది.శాస్త్రవేత్తలు కొత్తకొత్త పరిశోధనలు చేస్తూ టెక్నాలజీనీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ ప్రపంచంలో గ్రహాలు, వాటిపై జీవినం అనే విషయంపై అనేక పరిశోధనలు అనేవి సాగుతున్నాయి.విశ్వంలో ఉండే గ్రహాలపై మానవ మనుగడ అనేది ఉంటుందా.? లేదా అనేవి దానిపై రకరకాల పరిశోధనలు అనేవి సాగుతున్నాయి.ఇటువంటి నేపథ్యంలో 30 సంవత్సరాలుగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణానికి మొదటి అడుగులు పడ్డాయి.

ద స్క్వేర్ కిలోమీటర్ ఆరే అబ్జర్వేటరీ అనే భారీ టెలిస్కోప్ ను నిర్మించనున్నారు.ఈ భారీ టెలిస్కోప్ ను దక్షిణాఫ్రికా, అస్ట్రేలియా దేశాలలో ఏర్పాటు చేయనుండటం విశేషంగా చెప్పొచ్చు.ఇప్పటికే ఈ భారీ టెలిస్కోప్ ను నిర్మించే పనులు అనేవి మొదలయ్యాయి.200 వ అతిపెద్ద డిష్ రిసీవర్ లు, కోటికిపై గా చిన్న యాంటెనాలతో అతి భారీ టెలిస్కోప్ ను నిర్మిస్తున్నారు.ఇప్పుడున్నటువంటి టెలిస్కోప్ లకంటే ఇది దాదాపుగా పదిరెట్లు పెద్దదిగా దీనిని తయారు చేయనున్నారు.

ఇది ప్రపంచంలోనే ఎక్కువ సామర్ధ్యం కలిగిన టెలిస్కోప్ గా ఉంది.ఇటువంటి భారీ టెలిస్కోప్ ద్వారా 70 మెగా హెడ్జ్ ల నుండి 25 గిగా హెడ్జల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను మనం వినవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Advertisement

50 ఏళ్ల పాటుగా ఈ టెలిస్కోప్ ను వాడుకునే విధంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు.ఎస్కేఏఓ మధ్య శ్రేణి వ్యవస్ధను దక్షిణాఫ్రికాలోని కరూ ఎడారిలో 50 అడుగుల స్థంలో 197 డిష్ లతో అతి భారీ టెలిస్కోప్ ను నిర్మించనున్నారు.ఇది తక్కువ శ్రేణి ఫ్రిక్వెన్సీని వినగలిగే వ్యవస్ధను 1,32,072 యాంటెనాలతో పశ్చిమ ఆస్ట్రేలియాలో దీనిని నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టులో పోర్చుగల్, ఆస్ట్రేలియా, చైనా , ఇటలీ, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్ డబ్ లు తమ నగదును వెచ్చించి దీనిని తయారు చేస్తుండటం గమనార్హం.ఇటువంటి భారీ టెలిస్కోప్ ను నిర్మించడానికి 2 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 14, 928 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు.2029నాటికి భారీ టెలిస్కోప్ నిర్మాణం పూర్తి కానుందని, అయితే 2024 నుంచే దీనిపై పరిశోధనలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు