పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూ సీక్రెట్ ఇదేనా..?

తొలి సినిమా గమ్యం నుంచి డైరెక్టర్ క్రిష్ వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ విజయాలు సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

క్రిష్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

ప్రస్తుతం క్రిష్ పవన్ తో హరిహరవీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.గత కొన్ని నెలల నుంచి పవన్ కళ్యాణ్ చేతిపై ఒక టాటూ దర్శనమిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ ఈ టాటూను వేయించుకున్నారని సమాచారం.సినిమా కథలో ఈ టాటూ కీలక పాత్ర వహిస్తుందని తెలుస్తోంది.

Advertisement

అయితే పవన్ కళ్యాణ్ టాటూకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మరోవైపు పవన్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని సమాచారం.

త్రిశూలంలా కనిపిస్తున్న ఈ టాటూను సినిమా షూటింగ్ పూర్తైన తరువాత పవన్ తొలగించుకోనున్నారని తెలుస్తోంది.మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగ పాత్రలో నటిస్తున్నారు.క్రిష్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం గమనార్హం.

పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే నిధి అగర్వాల్ కు మరి కొందరు స్టార్ హీరోలు సైతం సినిమా ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాతో నిధి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు