తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.ఫరీదాబాద్ కు చెందిన రామచంద్ర భారతి నేతృత్వంలో డీల్ కొనసాగినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో కీలక అంశాలు నేడు బయటకు రానున్నాయి.డీల్ కు సంబంధించిన వీడియో, ఆడియోలను ఎమ్మెల్యేలు బయట పెట్టే అవకాశం ఉంది.
డీల్ సమయంలో అగ్రనేతతో సతీశ్ శర్మ మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా బేరసారాలు సాగాయి.
ఈ క్రమంలో ఆయన ముందుగానే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో కొనుగోలు డీల్ చేస్తున్న ముగ్గురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ముందుగా రోహిత్ రెడ్డితో మాట్లాడిన నందు.అనంతరం మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
ఎంత నగదు, ఏయే కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారో అన్న విషయాలను సైబరాబాద్ పోలీసులు వెల్లడించనున్నారు.కాగా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.