వామ్మో, 20,000 మందిని మింగేసిన మిస్టీరియస్‌ 'అలాస్కా ట్రయాంగిల్'..

బెర్ముడా ట్రయాంగిల్( Bermuda Triangle ) గురించి మనందరికీ తెలిసిందే.ఆ ట్రయాంగిల్ మీద వెళ్లిన నౌక లేదా విమానం ఏదైనా సరే కనిపించకుండా పోతుంది.

బెర్ముడా త్రిభుజంలాగే, అలాస్కాలో ఉత్కియాగ్విక్ నగరంలో కూడా ఒక ప్రదేశం ఉంది.ఇక్కడ 20,000 మందికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు.ఇది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది.1970ల నుంచి అలాస్కాలోని ( Alaska )ఒక విశాలమైన ప్రాంతంలో 20,000 మందికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు.అందుకే ఈ ప్రాంతంలో ఇప్పుడు చాలా తక్కువ మంది నివసిస్తున్నారు అని IFL సైన్స్ అనే సైన్స్ జర్నల్ చెప్పింది.

అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అలాస్కాలో ప్రజలు కనిపించకుండా పోవడం రెట్టింపు అని అంచనా.ప్రతి ఏడాది సగటున 2,250 మంది అలాస్కాలో అదృశ్యమవుతున్నారు.ఈ ప్రాంతంలో అదృశ్యమైన ప్రముఖులలో ఇద్దరు రాజకీయ నాయకులు, అమెరికా కాంగ్రెస్ నాయకుడు థామస్ హేల్ బాగ్స్ సీనియర్( Congress leader Thomas Hale Baggs ), అలాస్కా కాంగ్రెస్ సభ్యుడు నిక్ బెగిచ్ ( Congressman Nick Begich )కూడా ఉన్నారు.

1972, అక్టోబర్ 16న, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు నిక్ బెగిచ్ ( Nick Begich )తన సహాయకుడు రస్సెల్ బ్రౌన్, పైలట్ డాన్ జోన్స్‌తో కలిసి అంచరేజ్ నుంచి జునౌకు విమానంలో వెళుతుండగా, ఆ విమానం కనిపించకుండా పోయింది.చాలా వెతికినా, వారి శరీరాలు లేదా విమానం దొరకలేదు.అయితే, తరువాత కొంతమంది మిస్సింగ్ పర్సన్స్ బాడీలు దొరికాయి.1970లలో ఒక గ్రామీణ ప్రాంతంలో వేటాడుతూ అదృశ్యమైన 25 ఏళ్ల గ్యారీ ఫ్రాంక్ సోథర్‌డెన్ అనే వ్యక్తి తల ఎముక అలాస్కా ఈశాన్యంలోని పోర్క్యూపైన్ నది ఒడ్డున రెండు దశాబ్దాల తర్వాత దొరికింది.2022లో ఆ తల ఎముక గ్యారీ ఫ్రాంక్ సోథర్‌డెన్ అనే వ్యక్తిదే అని డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించారు.అతన్ని ఎలుగుబంటి చంపి ఉంటుందని అనుకుంటున్నారు.

Advertisement

అలాస్కా ట్రయాంగిల్‌లో ఇలా ఎందుకు చాలామంది అదృశ్యమవుతున్నారనే దానికి చాలా రకాల కారణాలు చెబుతున్నారు.కొందరు అక్కడ అయస్కాంత శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని, మరికొందరు అక్కడ ఎక్కువగా ఉల్కలు పడుతున్నాయని అంటారు.కానీ, ఈ విషయానికి చాలా సులభమైన వివరణ కూడా ఉంది.

అలాస్కా చాలా పెద్ద ప్రాంతం.అక్కడ అడవులు, పర్వతాలు చాలా ఎక్కువ.

అందువల్లనే చాలామంది అక్కడ పోయి, తిరిగి రాలేకపోతున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు