హృదయ విదారక ఘటన.. శిశువు ప్రాణం తీసిన కోతి.. !

తమిళనాడులో ఘోరం జరిగింది.

తంజాపూర్ జిల్లాలోని మేలవీధిలో, కోట్టై అగళి ప్రాంతానికి చెందిన భువనేశ్వరి తన ఇద్దరు కవల పిల్లలను నిన్న శనివారం ఇంట్లో చాప పై పడుకోబెట్టి స్నానానికి వెళ్లిందట.

అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఓ కోతుల గుంపు వీరింట్లోకి చొరబడి ఆ శిశువులిద్దరిని ఎత్తుకెళ్లాయట.స్నానం చేసి వచ్చిన భువనేశ్వరి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ శిశువులు కనిపించక పోవడంతో భయపడి పోయి బయట వెతుకుతున్న క్రమంలో ఇంటి పైకప్పు నుంచి శిశువు ఏడుపు వినిపించిందట.

భయపడుతూనే ఇంటిపైకి చూడగా అక్కడ కూర్చున్న కోతి చేతిలో పాప ఉండటాన్ని గమనించి భువనేశ్వరి ఏడుస్తూ కేకలు వేసింది.ఆ అరుపులు విని బయటకు వచ్చిన ఇరుగు పొరుగు వారు కోతిని తరమడంతో ఒక శిశువును వదిలి పారిపోయింది.

ఇక రెండో శిశువు కోసం వెతుకుతుండగా ఇంటి వెనుక ఉన్న కందకంలో కనిపించిందట.స్దానికులు వెంటనే ఆ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

దీంతో ఆ తల్లి హృదయ వేదన వర్ణనాతీతం.ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి వల్ల కాలేదట.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు