చీటింగ్ కేసులో ఇరుక్కున్న ఫేమస్ డ్యాన్సర్.. ఎవరంటే?

ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరీ తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది.ఏకంగా ఆమె అభిమానులే ఆమె పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీనితో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అసలేం జరిగిందంటే.

తాజాగా లక్నోలోని స్థానిక కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.డాన్స్ పోగ్రామ్ నిర్వహిస్తున్నాము అంటూ స్వప్న అండ్ టీమ్ డబ్బులు వసూలు చేశారట.

ఆ పోగ్రామ్ రద్దు అవడంతో టికెట్ హోల్డర్లకు డబ్బులు తిరిగి చెల్లించలేదు.దీనితో డబ్బులు చెల్లించలేదు అన్న ఆరోపణలపై అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శంతను త్యాగి అరెస్టు వారెంట్ జారీ చేశారు.అంతే కాకుండా ఈ కేసు తదుపరి విచారణ తేది నవంబర్ 22న ఉండబోతోందని ఆమెను కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు.2018 అక్టోబర్ 13న లక్నోకు చెందిన స్కృతి సప్నా చౌదరి డ్యాన్స్ షో కోసం ఏర్పాటుచేసిన అటెండ్ కాకపోవడంతో రద్దు చేశారు.

Advertisement

కానీ 300 టికెట్ తో స్వప్న డాన్స్ ప్రోగ్రాం కోసం వెయిట్ చేసిన అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అందరూ కలిసి అక్టోబర్ 14న లక్నోలోని ఆశియానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దీంతో డాన్సర్ స్వప్న చౌదరి తోపాటు షో నిర్వాహకులు పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.మరి ఈ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాలి అంటే నవంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.

అలాగే ఆమె అభిమానులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తుందా లేదా అన్న విషయం కూడా తెలియాలి.

Advertisement

తాజా వార్తలు