జియో సిమ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లందరినీ హెచ్చరించింది.ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు జియో యూజర్లను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది.

ఇప్పుడు జియో యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని లేదంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఫేక్ కాల్స్, ఫ్రాడ్ ఎస్ఎంఎస్ ల వల్ల చాలామంది అమాయకులు మోసపోయారని జియో తెలిపింది.

తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాళ్లు మీ డబ్బులు కాజేస్తారని జియో సంస్థ అలర్ట్ చేసింది.గతంలో ఎయిర్ టెల్, వొడాఫోన్‌ ఐడియా కూడా తమ యూజర్లకు అలర్ట్ చేశాయి.

ఈ-కేవైసీ వెరిఫికేషన్ అంటూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎయిర్ టెల్, వొడాఫోన్‌ ఐడియా సూచిస్తున్నాయి.ఈ కేవైసీ చీటింగ్స్, ఫేక్ ఎస్ఎంఎస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తాజాగా జియో కూడా యూజర్లకు తెలియజేసింది.

Advertisement

కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ స్కామ్స్ కాల్స్ మరింత పెరిగిపోయాయని పేర్కొంది.న్యూ ఇయర్ ఆఫర్లు, పండుగ ఆఫర్ల పేరిట ఏవైనా మెసేజ్ లింకులు కనిపిస్తే వాటి జోలికి వెళ్లొద్దు అని జియో తన యూజర్లను హెచ్చరించింది.

అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ ను సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయకపోవడం శ్రేయస్కరమని తెలిపింది.

ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ వచ్చే కాల్స్ కు రెస్పాండ్ అవ్వద్దు అని.జియో యూజర్లు ఎవరూ థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని ఆ కంపెనీ సూచిస్తోంది.థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేయమని జియో ఎవరినీ విజ్ఞప్తి చేయదని కంపెనీ తెలిపింది.

అందువల్ల అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాలంటూ వచ్చే మెసేజ్ లేదా కాల్ స్పందించవద్దని సూచించింది.అజ్ఞాత వ్యక్తుల తో బ్యాంకు వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలియజేసింది.కొన్ని జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకొని భారీ మోసాలను నిరోధించవచ్చని జియో వెల్లడించింది.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement
" autoplay>

తాజా వార్తలు