ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సల్మాన్ ఖాన్ తాజాగా డిసెంబర్ 27న తన 56 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.

ఇక 56 వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి వార్తల్లో నిలిచాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ క్రమంలోనే హీరోయిన్ జెనీలియా తో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ కు సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజాగా ముంబైలోని పన్వెల్ లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు.

సిక్స్ ప్యాక్ బాడీ తో, తన నటనతో, డాన్సులతో, హీరోయిజం తో ప్రేక్షకులను మెప్పించే సల్మాన్ ఖాన్ ఇలా ఆటో నడపడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తమ అభిమాన హీరో ఆటో నడపడం చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్ లు సల్మాన్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించగా, ఇంకొందరు నెటిజన్స్ మాత్రం సల్మాన్ ఖాన్ ను ఏకిపారేశారు.

ఇది ఒమిక్రాన్ కంటే డేంజర్ అంటూ ఒక యూజర్ కామెంట్ చేస్తూ అందరూ త్వరగా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి అంటూ సెటైర్ వేశాడు.

మరొక నెటిజన్ అయితే ఆటోలో పాము లేదా అంటూ కామెంట్ చేశాడు.ఇటీవలే సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే.హాస్పిటల్లో ఆరు గంటల పాటు చికిత్స తీసుకున్న తరువాత డిశ్చార్జ్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్ ను కాటేసిన ఆ పాము ప్రమాదకరమైన విషసర్పం కాదని సల్మాన్ ఖాన్ తెలిపాడు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు