మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిచిన భారత జట్టు..!

భారత జట్టు( Indian team ) అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

భారత క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన సందర్భం చోటు చేసుకుందని చెప్పాలి.

భారత జట్టు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.తాజాగా జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై( Australia ) విజయం సాధించి వన్డేల్లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

నిన్నటి వరకు పాకిస్తాన్ జట్టు 115 పాయింట్ లతో వన్డేలలో మొదటి స్థానంలో ఉండేది.తాజాగా జరిగిన వన్డే మ్యాచ్ లో విజయం తర్వాత భారత్ 116 పాయింట్ లతో పాకిస్తాన్ ( Pakistan )ను వెనుకకు నెట్టి నెంబర్ వన్ స్థానానికి చేరింది.

ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

The Indian Team Is Number One In Three Formats , Indian Team, Australia, Pakis
Advertisement
The Indian Team Is Number One In Three Formats , Indian Team, Australia, Pakis

క్రికెట్ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.ఐసీసీ వన్డే బౌలింగ్ లో హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్లు తీసి వన్డేలలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.టీ20 బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అర్థ సెంచరీ చేసి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు.

టెస్ట్ ఫార్మాట్ లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు.టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు.వన్డే బ్యాటింగ్ లో శుబ్ మన్ గిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

భారత జట్టు ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఒకటి లేదా రెండవ స్థానాలలో ఉండడం భారతీయులు గర్వించదగ్గ విషయం.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు