అమెరికాలో మహిళను చీట్ చేసిన భారత ఎన్నారై...క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..!!!

మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, తప్పు చేసి ఏం తెలియనట్టు తప్పించుకుంటే దాని ఫలితం ఎప్పటికైనా వెంటాడుతుంది, చేసిన తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే.

భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై అమెరికాలో ఉంటూ అక్కడి మహిళతో సహా జీవనం చేసి బిడ్డను కన్నా తరువాత బిడ్డతో సహా భారత్ వచ్చేసిన తరువాత ఆ అమెరికన్ మహిళ ఏళ్ళ తరబడి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే.గుజరాత్ లోని వడోదర కి చెందిన అమిత్ కుమార్ పటేల్ అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడ్డారు పైగా అతడికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది.

అయితే 2015 లో అమెరికాలోని న్యూజెర్సీ లో నివాసం ఉండే అమిత్ అక్కడ ఓ మహిళతో సహజీవనం చేశాడు.ఆమె ద్వారా ఓ బిడ్డను కన్న అమిత్ కుమార్ బిడ్డ పుట్టిన తరువాత అతడి అసలు రంగు బయట పెట్టాడు.

బిడ్డ తో సహా భారత్ కు చేక్కేయాలని ప్లాన్ చేసుకున్న అమిత్ తన కుటుంబానికి బిడ్డను పరిచయం చేయాలని భావిస్తున్నాని, బిడ్డకు కోట్లాది రూపాయల ఆస్తి వస్తుందని, అయితే డానికి సంభందించి కొన్ని టెస్ట్ లు చేయించాలని అలాగే పిల్లాడికి భారత పౌరసత్వం వచ్చేయాలా చేయాలని అలా చేసిన తరుణం ఆస్తి మొత్తం తన పేరుమీద వస్తుందని నమ్మబలికాడు.అయితే ఇవన్నీ జరగాలంటే పిల్లాడిభాద్యతను తాను చూసుకోలేక పోతున్న కారణంగా తన భర్తకు అప్పగిస్తున్నట్టుగా కోర్టులో పిటిషన్ వేయాలని అలా చేస్తేనే పిల్లాడని తనతో పాటు భారత్ పంపుతారని ఆమెతో అమిత్ చెప్పడంతో సరే నని కోర్టులో కూడా అమిత్ చెప్పినట్టుగానే చెప్పింది.

Advertisement

దాంతో అమెరికా కోర్టు అమిత్ కు పిల్లాడని మొత్తం భాద్యతలు అప్పగిస్తూ తీర్పు చెప్పడంతో పిల్లాడితో సహ భారత్ వెళ్ళిన అమిత్ తరువాత ఇక తాను అమెరికా వచ్చేది లేదంటూ ఆమెకు చెప్పడంతో అక్కడి కోర్టులో అమిత్ కు వ్యతిరేకంగా 2018 లో పిటిషన్ వేసింది.అయినా అమిత్ లెక్క చేయకపోగా బ్రిటన్ వెళ్లి స్థిరపడాలని బిడ్డతో సహా వెళ్ళడంతో అప్పటికే అక్కడి పోలీసులకు అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే అరెస్ట్ చేసి అక్కడి చట్టాల ప్రకారం బిడ్డను అమిత్ తల్లి తండ్రులకు అప్పగించి అమిత్ ను అమెరికా కోర్టుకు తరలించారు.కాగా అమెరికా కోర్టు అమిత్ కు 3 ఏళ్ళు జైలు జీవితంతో పాటు ఆమెకు 2.5 లక్షల డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు