బాలయ్య భారీ బడ్జెట్ మూవీ ఆగిపోవడానికి అసలు కారణమిదా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ జానర్, ఆ జానర అనే తేడాలు లేకుండా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తారనే సంగతి తెలిసిందే.ఆ సినిమాలతో బాలయ్య భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

 Reasons Behind Balakrishna Huge Budget Movie Stopped Details Here , Balakrishna-TeluguStop.com

అయితే బాలయ్య సినీ కెరీర్ లో షూటింగ్ మొదలైన తర్వాత ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి.తాతమ్మ కల సినిమాతో హీరోగా బాలయ్య కెరీర్ మొదలైంది.

కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరో తరహా పాత్రలలో బాలయ్య నటించారు.

నటుడిగా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత బాలయ్య హీరో పాత్రలలో నటించి మెప్పించడం గమనార్హం.

బాలయ్య కోడి రామకృష్ణ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనల్లుడు, బాల గోపాలుడు, మువ్వగోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

Telugu Balakrishna, Balayyakodi, Kodi Divya, Vikramasimha-Movie

బాలయ్య కోడి రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేశాయి.అయితే 2001 సంవత్సరంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా బాలయ్య హీరోగా విక్రమసింహ భూపతి పేరుతో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా ఆగిపోవడం గమనార్హం.

Telugu Balakrishna, Balayyakodi, Kodi Divya, Vikramasimha-Movie

కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య తాజాగా మాట్లాడుతూ ఈ సినిమా ఆగిపోవడం వెనుక అసలు కారణాలను వెల్లడించారు.విక్రమ సింహ భూపతి బడ్జెట్ వల్ల ఆగిపోయిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే ఈ సినిమా గోపాల్ రెడ్డి గారి అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైన కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.ఈ సినిమా విడుదలై ఉంటే బాగుండేదని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube