పేరుకు పెద్దమనిషి.. బుద్ధిమాత్రం వంకర.. చివరకు బాలిక ప్రాణాలు తీశాడు..

అతడు సమాజంలో పెద్దమనిషి.కానీ అతని బుద్ధి మాత్రం వంకర పోయింది.

చాలా నీచంగా ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఓ బాలికను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.

పాపం ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించిన ఆ బాలిక.తనలో తానే కుమిలిపోయింది.

వేధింపులు మరింత ఎక్కువ కావడంతో చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.విజయవాడలో శనివారం సాయంత్రం జరగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Advertisement

విజయవాడలోని కుమ్మరి పాలెం సెంటర్‌కు దగ్గర్లో ఈ ఘటన జరిగింది.అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో నివాసముండే 55 ఏళ్లున్న వినోద్ జైన్ అందులోని ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

వాకింగ్ కోసం అపార్ట్ మెంట్ పైకి వచ్చే ఆ బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించేవాడు.దీంతో నిస్సహాయ స్థితిలోకి చేరుకున్న బాలిక అదే అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ బాలిక రాసిన మూడు పేజీల లేఖను పోలీసులు గుర్తించారు.అమ్మా.

నేను ఈ విషయాన్ని మొదట్లో మీకు చెప్పలేదు.నాకు భయం వేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

జీవితంలో మరే ఇతర సమస్య వచ్చినా నేను చనిపోయేదాన్ని కాదేమో.ఇందుకు కారణం వినోద్ జైన్.

Advertisement

రెండు నెలలుగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. అసభ్యంగా నా శరీరాన్ని తాకుతున్నాడు.

నాతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు.మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు.

కానీ తప్పడం లేదు.అంటూ ఆ బాలిక ఆ లేఖలో పేర్కొంది.

దీంతో స్థానికులు అపార్ట్ మెంట్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత కావడంతో అతన్ని పార్టీ నుంచి టీడీపీ అధిష్ఠానం బహిష్కరించింది.బాధిత కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించారు.

తాజా వార్తలు