ఈనెల 21 నుంచి జనసేన నాలుగో విడత వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది.

ఇప్పటికే మూడు దశల్లో చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నాలుగో విడత వారాహి యాత్రకు జనసేనాని సిద్ధం అయ్యారని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారని సమాచారం.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఇటీవల టీడీపీ కలిసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీలో అరాచక పాలన సాగుతుందని, దాన్ని అంతం చేసేందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు