హైదరాబాదులో నకిలీ టాస్క్ ఫోర్స్ పోలీసుల హల్ చల్.. చిన్న క్లూ తో అడ్డంగా దొరికిన నిందితులు..!

ప్రస్తుత కాలంలో యువత జల్సాలకు అలవాటు పడి బాధ్యత రహితంగా తప్పుడు దారులలో వెళ్తూ అనవసరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఏకంగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసుల మంటూ అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో హల్చల్ సృష్టించారు.

చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

ఫిలింనగర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ఎస్ఏ కాలనీలో నివాసం ఉంటున్న భాషిఫ్ అహ్మద్ చౌదరి( Bashif Ahmad Chaudhary ) (22) అనే బిటెక్ విద్యార్థి ఈనెల 4వ తేదీ తెల్లవారుజామున సుమారుగా నాలుగు గంటల సమయంలో హకీంపేట( Hakimpet ) సమీపంలోని బృందావన్ కాలనీలో బైక్ పై వెళుతూ ఉండగా.

ఆకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వచ్చి భాషిఫ్ ఆహ్మద్ ను అడ్డుకున్నారు.ఆ తర్వాత తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించారు.అనంతరం ఆన్లైన్ ద్వారా రూ.3 వేలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.

Advertisement

ఆ తరువాత భాషిఫ్ ఆహ్మద్ సెల్ఫోన్ కు చెందిన ఇయర్ బడ్స్ ఒకటి లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు.బాధితుడు వెంటనే ఫిలింనగర్ క్రైమ్ పోలీసులకు( Filmnagar Crime Police ) ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ఉండే సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు.

నిందితులు ఐఫోన్ కు సంబంధించిన ఇయర్ బడ్స్ జతలో ఒకదానిని లాక్కొని పారిపోయిన విషయం పోలీసులకు బాధితుడు తెలపడంతో.పోలీసులు ఐఫోన్ లోని ట్రాకర్ సహాయంతో నిందితుల లొకేషన్ ను గుర్తించారు.

నిందితులు మెహిదీపట్నం రాయల్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్( Sheikh Mohammed Saif ) (23), హుమాయున్ నగర్ కు చెందిన అష్వక్ అహ్మద్ (23), మహమ్మద్ ఇద్రిసన్ లుగా గుర్తించారు.ఈ ముగ్గురు జల్సాలకు అలవాటు పడి రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.చిన్న క్లూ ఆధారంగా నిందితులను పట్టుకోవడం వల్ల ఫిలింనగర్ క్రైమ్ పోలీసులను ఉన్నత అధికారులు అభినందించారు.

వాకింగ్ వ‌ల్ల గ‌ర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత సేపు వాకింగ్ చేయొచ్చు?
Advertisement

తాజా వార్తలు