యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )మరో బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పాడు.పాన్ ఇండియా డైనోసార్ లాంటి ప్రభాస్ అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘సలార్’ ఒకటి.ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు.

మరి ప్రభాస్ చేస్తున్న ‘సలార్( Salaar )’ మూవీ నుండి మొన్ననే టీజర్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు టీజర్ రిలీజ్ చేసి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ అయ్యేలా చేయడంతో మేకర్స్ సఫలం అయ్యారు.

తాజాగా వచ్చిన టీజర్ 24 గంటల్లోనే ఈ టీజర్ 83 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయగా ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డులను తిరగరాసింది.ఈ సెన్సేషన్ తో సలార్ టీజర్ ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ వచ్చిన టీజర్ గా రికార్డ్ కెక్కింది.అంతేకాదు ప్రభాస్ ఖాతాలో మరో 100 మిలియన్ టీజర్ గా ఆదిపురుష్, సాహో తర్వాత నిలిచింది.కాగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (P rashanth Neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.







