ములుగు జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది వ్యక్తులు డబ్బుకు ఇచ్చే విలువ సొంత కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు.డబ్బు ముందు మానవ సంబంధాలు చెల్లవు అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

 Atrocity In Mulugu District Brother Killed For Property , Mulugu , Brother Kille-TeluguStop.com

ఓ వ్యక్తి తన తండ్రి పేరు పై ఉన్న ఒక ఎకరం భూమి తనకే సొంతం కావాలనే స్వార్థంతో ఏకంగా సొంత అన్ననే దారుణంగా హత్య చేశాడు.ఈ హత్య ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ములుగు( Mulugu ) జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో మొడెం రామయ్యకు చంటి, శివాజీ ( Chanti, Shivaji )అనే కుమారులు ఉన్నారు.అయితే చంటి చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకొని, 8 సంవత్సరాల నుండి మురుదొండ లోనే కాపురం ఉంటున్నాడు.

అయితే మొడెం రామయ్య పేరిట ఒక ఎకరం భూమి( 1 acre of land ) ఉంది.ఆ ఎకరం భూమిని నా పేరు పై రాయాలని శివాజీ ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవ పడేవాడు.గొడవలతో విసుగు చెందిన తల్లిదండ్రులు భయంతో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు.తరువాత శివాజీ తన అన్న చంటి ఇంటికి వెళ్లి ఇదే విషయంపై గొడవపడ్డాడు.కాసేపు అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం జరిగింది.క్షణికావేశంలో శివాజీ కత్తితో చంటి కడుపులో బలంగా పొడిచాడు.

దీంతో చంటి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ భార్య సీమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న శివాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube