ఆ శునకంకి విగ్రహం పెట్టేశారు.. ఎందుకంటే..?!

సాధారణంగా మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందని అందరూ అంటూ ఉండడం సహజం.

 అలాగే కొన్ని ట్రైనింగ్ కుక్కలు ఏదైనా క్రిమినల్ కేసులను ఛేదించడంలో కీలక పాత్రలు వహిస్తూ ఉంటాయి.

శునకాలు వాసన బట్టి నిందితులను పట్టుకోవడం, కొన్ని కేసులలో అనుమానం ఉన్న వస్తువులను కనిపెట్టడంలో అవి దిట్ట.అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ప్రముఖ కేసులను పూర్తి చేయడంతోపాటు నిందితులను పోలీసులకు పట్టించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

అందుకొరకే పోలీసులు కూడా కుక్కలకు సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.ఈ తరుణంలో అనేక సేవలు అందించిన ఒక రకానికి చెందిన శునకానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అదికూడా ఆ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ ముందే ఆవిష్కరణ చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement
Muzaffarnagar Police Built Statue To Dog Calld Tinky, Dog, Statute, Tinki, Uttar

ఉత్తర్ ప్రదేశ్ లో ముజఫర్​ నగర్ పోలీస్ స్టేషన్ ముందు టింకి అనే జర్మన్ షెపర్డ్ అనే జాతికి చెందిన శునకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది.ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్​నగర్ పోలీసులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

దాదాపు 49 క్రిమినల్ కేసుల్లో కీలకమైన ఆధారాలను సేకరించిన ఈ శునకానికి పోలీసులు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు.జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన టింకీ.

గ్వాలియర్​లోని బీఎస్​ఎఫ్ అకాడమీ పరిధిలోని నేషనల్ డాగ్ సెంటర్ ద్వారా ఆ కుక్క విధులు విధులు నిర్వహిస్తోంది.ఈ శునకం మొదట ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ లో ఒక కానిస్టేబుల్ వద్ద స్నిఫర్ డాగ్​ గా విధులు నిర్వహిస్తూ కేసులు చేదించడంలో చిలక పాత్ర వ్యవహరిస్తూ.ఆరేళ్లలో ఆరుసార్లు ప్రమోషన్లు తెచ్చుకుంది.8 సంవత్సరాల వయస్సు గల ఈ శునకం గత సంవత్సరం నవంబర్ నెలలో మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు.

Muzaffarnagar Police Built Statue To Dog Calld Tinky, Dog, Statute, Tinki, Uttar
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు