దేవుడి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు.. నవదంపతుల దుర్మరణం.. !

శివరాత్రి రోజే ఒక నవజంట జీవితంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.కాళ్ల పారాణి ఆరక ముందే ఆ ఇద్దరి ప్రాణాలను తీసుకెళ్లాడు ఆ యముడు.

అది శివరాత్రి రోజే కావడం యాద్రిచ్చికం ఆ వివరాలు తెలుసుకుంటే.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోరకొండకు చెందిన జాటోతు లక్ష్మణ్ (30) కు మూడు నెలల క్రితమే మంగా (22) అనే యువతితో వివాహం జరిగింది.

The Death A Newlywed Couple While Goingto See God Manchala, Couple Died, Road Ac

అప్పటి నుండి అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో శివరాత్రి చివరి రాత్రి అవుతుందని ఊహించలేక పోయారు.కాగా ఈరోజు ఆనందంగా ఇంట్లో పూజ చేసుకునిగ్రామం ఉన్న శివాలయంలో పూజలు చేసి, చారిత్రక నేపథ్యం ఉన్న నల్లగొండ జిల్లాలోని రాచకొండ శివాలయానికి బైక్‌పై బయలుదేరారు.

ఈ క్రమంలో బైక్ జపాల గ్రామ సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద స్లిప్ అవగా ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.కాగా ఈ ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

కాగా పెళ్లైన మూడు నెలలకే నవ దంపతులు మృతి చెందడం.ఆది దేవుడి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు వెళ్లడం విచారకరం.

రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!
Advertisement

తాజా వార్తలు