ఆలయం లోని హుండీలో నగదును కొట్టేసిన ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్..!

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనే సామెత చాలామంది వినే ఉంటారు.

అయితే ఓ ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్( Chief Security Officer of the temple ) ఆలయంలోని హుండీలో ఉండే నగదును కాజేసి తనకేం తెలియనట్టు మౌనంగా ఉన్నాడు.

కానీ పక్కనే ఉన్న సీసీ కెమెరాలు హుండీలో చెయ్యి పెట్టి డబ్బు తీస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ఈ ఘటన అనంతపురం జిల్లా కసాపురం లోని నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి( Shri Nettikanti Anjaneya Swami ) వారి ఆలయంలో కృష్ణారెడ్డి( Krishna Reddy ) అనే వ్యక్తి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.తెల్లవారుజామున అభిషేకం సమయంలో ఆలయంలోని హుండీలో ఏకంగా 8 పర్యాయాలు నగదు దొంగతనానికి పాల్పడ్డాడు.

Advertisement
The Chief Security Officer Of The Temple Who Knocked Cash Into The Hundi In The

చోరీ విషయం గురించి సమాచారం అందుకున్న ఆలయ అధికారులు ఆలయంలో ఉండే సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు.

The Chief Security Officer Of The Temple Who Knocked Cash Into The Hundi In The

ఈరోజు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కృష్ణారెడ్డి ఆలయంలోని హుండీలో చేయి పెట్టి నగదు చోరీ చేసి తన ప్యాంటు జేబులో పెట్టుకున్న దృశ్యాలు సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయింది.వెంటనే ఆలయ అధికారులు విధుల నుండి తొలగించి కసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కృష్ణారెడ్డి పై ఫిర్యాదు చేశారు.అయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఇతరుల పేరుపై నిర్వహిస్తూ దాదాపుగా 20 సంవత్సరాలు ఆలయంలోనే పాగా వేసిన కృష్ణారెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

The Chief Security Officer Of The Temple Who Knocked Cash Into The Hundi In The

ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలు.సులభంగా చెయ్యి పెట్టి డబ్బులు దొంగలించే విధంగా ఉండడంతో భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆలయంలో ఎన్నిసార్లు చోరీలు జరిగాయో.

ఇంతకాలం నుండి చోరీలకు పాల్పడుతున్నారో.ఇంకా ఎంతమంది దొంగల ప్రమేయం ఉందో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
అల్లు అర్జున్ కి అట్లీ సక్సెస్ ఇస్తాడా..?

దేవస్థాన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చోరీలకు పాల్పడుతున్న సంగతి అక్కడ పూజలు చేసే అర్చకులకు ఇతర సిబ్బందికి తెలుసా.తెలియదా.

Advertisement

ఒకవేళ తెలిసి కూడా మౌనంగా ఉన్నారా అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది.ఈ చోరీ ఘటనపై ఆలయ ఈవో వెంకటరెడ్డి మాట్లాడుతూ మొత్తం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

తాజా వార్తలు