ఓ యువకుడు ఎంతో ప్రాణంగా ప్రేమించిన యువతిని రహస్య వివాహం చేసుకున్నాడు.వీరికి ఒక సంతానం పుట్టగా, ఆ బిడ్డను వేరే వారికి దత్తత ఇచ్చారు.
అయితే ఆ యువకుడు భార్యతోనే కాకుండా ఇతర అమ్మాయిలతో కూడా చనువుగా ఉండడం భార్యకు తెలియడంతో భార్యను హత్య చేశాడు.ఇక ఎవరికి దొరకను అనుకొని తన భార్య శవాన్ని ఏకంగా వాట్సప్ స్టేటస్ గా పెట్టుకొని పోలీసుల చేతికి అడ్డంగా చిక్కాడు.
ఈ ఘటన తమిళనాడు( Tamil Nadu )లోని చెన్నైలో చోటుచేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కేరళ( Kerala )కు చెందిన ఆషిక్, ఫౌజియా ప్రేమించుకుని గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.రెండేళ్ల క్రితం ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఒక సంతానం జన్మించగా వేరే వారికి దత్తత ఇచ్చారు.ఫౌజియా చెన్నైలోని ఓ నర్సింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతోంది.ఆషిక్ పలువురు అమ్మాయిలతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడు అనే విషయం ఫౌజియాకు తెలిసింది.
ఈ విషయంపై ఆషిక్ ను గట్టిగా నిలదీసింది.

ఈ క్రమంలోనే చెన్నై( Chennai )లోని ఒక హోటల్లో ఈ దంపతులిద్దరూ మరోసారి గొడవపడ్డారు.ఆషిక్ ఫోన్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలు పై ఫౌజియా గట్టిగా నిలదీయడంతో.క్షణికావేశంలో ఆషిక్ తన టీ షర్ట్ ను ఆమె మెడకు బిగించి హత్య చేశాడు.
హత్య అనంతరం మృతదేహాన్ని హోటల్ రూమ్ లోనే దాచిపెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు.ఆ తర్వాత ప్రియురాలి శవాన్ని వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు.ఫౌజియా స్నేహితురాళ్ళు ఆ ఫోటో చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఆ హోటల్ గదికి చేరుకొని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా యువతి మృతదేహం కనిపించింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.