అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ట్రంప్ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభ్యంతరాలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో సొంత దేశంలో ప్రజలు తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులపై గళం విప్పుతున్నారు.అయితే మా దేశపు అధ్యక్షుడు అతిపెద్ద జాత్యహంకారి అంటూ రాజకీయవేత్త, యునైటెడ్ స్టేట్స్ వార్మోంట్ సెనెటర్ బెర్ని శాండర్స్ విమర్శించారు.
మార్టిన్ లూథర్ కింగ్ డే సందర్భంగా “సౌత్ కరోలినా” లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్ళిన ఆయన ఈ సందర్భంలో ట్రంప్ పై కొన్ని ఘాటైన విమర్శలు చేశారు.ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ లింగ ,జాతి ,అంటూ ప్రాంతాల వారిగా అందరిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది కోన్ దేశంలో గత కొన్నాళ్లుగా తీవ్ర వివక్షతకు గురవుతున్నారని ఆన్నారు.
అలాంటి వారి బాధలు చెప్పలేమని వారి భవిష్యత్తుపై తనకు బెంగ ఉందని అన్నారు.ట్రంప్ తన జాత్యహంకారంతో లక్షలాది ఉద్యోగులని రోడ్డు పాలు చేశారని విమర్శించారు.అమెరికా అభివృద్దిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకి సరైన తిండి లేదని ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు.