అమెరికాలో తెలుగువారికి కొదవలేదు.ఎంతో మంది తెలుగు వారు అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితమే స్థిరపడ్డారు.
అక్కడ తెలుగు వారి కోసం ఎన్నో సంఘాలు ప్రాంతాల వారిగా , రాష్ట్రాల వారిగా ఎంపిక కాబడ్డాయి.అయితే అమెరికాలో ఉన్న సంఘాలలో టాటా (తెలంగాణ అమెరికా తెలుగు సంఘం) కూడా ఒకటి.
ఈ సంఘానికి తాజాగా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసుకున్నారు.

లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన టాటా బోర్డ్ మీటింగ్ లో 150 మంది సభ్యులు టాటా ప్రెసిడెంట్ గా విక్రమ్ జనగామను అడ్వైజరీ కౌన్సిల్ ఎంపిక చేశారు.టాటా మాజీ అధ్యక్షులు డా.హరనాత్ పొలిచర్ల తన హయాంలో టాటా ఎటువంటి విజయాలు సాధించిందో వివరించారు.

తనని నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేసిన వారి అందరికి విక్రమ్ ధన్యవాదాలు తెలిపారు.విక్రమ్ కి సేవపట్ల , మాత్రు భూమి పట్ల ఎంతో గౌరవం ఉందని, ఇప్పటికే ఆయన ఎన్నో రకాలుగా సేవాకార్యక్రమాలు చేపట్టారని.ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సభ్యులు తెలుపారు.







