పాన్ ఇండియా హీరో తో సినిమా చేస్తున్న తరుణ్ భాస్కర్...

సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఒక సినిమా తీశాడు అంటే ఆ సినిమా విజయం సాధిస్తేనే ఆ దర్శకుడుకి మంచి పేరు వస్తుంది.

లేకపోతే మాత్రం ఆ దర్శకుడు ఫేడ్ అవుట్ అయిపోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా చాలామంది దర్శకులు చాలా మంచి కాన్సెప్ట్ లతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అవి సరైన సక్సెస్ లు సాధించకపోవడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది డైరెక్టర్లు వాళ్ళ దగ్గర ఉన్న కాంటెంట్ ని మంచి సినిమా గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక ఇందులో భాగంగానే చాలా సినిమాలు ఇప్పుడు ఇలాగే వచ్చి మంచి విజయాలను సాధించాయి.ఇక అలాంటి క్రమం లోనే రీసెంట్ గా వచ్చిన కిడా కోలా( Keedaa Cola ) కూడా ఒకటి.తరుణ్ భాస్క( Tharun bhaskar )ర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది.

అయితే పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమా చేశాడు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.ఎందుకంటే అప్పట్లో జూనియర్ ఎన్టీయార్ ని కలిసి కొన్ని కథలు కూడా చెప్పిన తరుణ్ ఆయన చెప్పిన కధల్లో దమ్ము లేకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఇంకో సినిమా చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు తరుణ్ మరో కొత్త కథని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పినట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆయన ఖాళీగా లేడు కాబట్టి ఒకవేళ ఎన్టీయార్ ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్న కూడా ఎన్టీయార్ ఇప్పుడు చేసిన సినిమాలు అన్ని అయిపోయే సరికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది.

కాబట్టి తరుణ్ భాస్కర్ ఆ లోపు మరో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు