అఖిల్‌ మూవీ టైటిల్‌ ఇదేనా?

అక్కినేని హీరో అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు పలు వార్తలు వచ్చాయి.

అయితే అవన్ని పుకార్లు మాత్రమే అంటూ చిత్ర యూనిట్‌ కొట్టి పారేసింది.

తాజాగా మరో టైటిల్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాకు పవర్‌ ఫుల్‌గా ఉండి, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉండే విధంగా ‘తాండవం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పలు టైటిల్స్‌ను చిత్ర యూనిట్‌ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్న నేపథ్యంలో ‘తాండవం’కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.ఈనెలాఖరున నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు దర్శకుడు వినాయక్‌ సిద్దం అవుతున్నాడు.

ఈ నేపథ్యంలో టైటిల్‌ను ఆ సమయం వరకు ఖరారు చేయాలని భావిస్తున్నారు.అందుకే టైటిల్‌ ఎంపిక పనిని వేగవంతం చేయడం జరిగింది.

Advertisement

అతి త్వరలోనే అఖిల్‌ మొదటి సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నితిన్‌ నిర్మిస్తున్నాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అక్టోబర్‌ 21న దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో సాహేసా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?
Advertisement

తాజా వార్తలు