ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్"

ప్రజల వద్ద నుండి స్వయంగా వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఠాణా దివస్ లో ప్రజల వద్ద నుండి 50 ఫిర్యాదులు స్వీకరణ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రజలకు మరింత చేరువగా పోలిసింగ్ వెళ్ళడానికి,వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్" కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అట్టి సమస్యలు పరిష్కరిస్తు ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం.

గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రోజున "ఠాణా దివస్" కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 50 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ లపై నమ్మకం కలిగేలా, దివ్యాంగులు, వృద్ధులు, దూరప్రాంతల నుండి తన కార్యాలయనికి రాలేని వారి వద్దకే పోలీస్ సేవలు అందలనే ఉద్దేశ్యంతో "ఠాణా దివస్" కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని అన్నారు.ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని,సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నరు.

భూ తగాధాలలో క్రిమినల్ సమస్య ఉన్న ఫిర్యాదులలో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని, సివిల్ సమస్యకు సంబంధించిన పిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాలని దానికోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పిస్తాం అన్నారు.వేములవాడరూరల్,టౌన్, ఎల్లారెడ్డిపేట్,ఇల్లంతకుంట, బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో నిర్వహించిన "ఠాణా దివస్" కార్యక్రమంలో వచ్చిన 52 ఫిర్యాదులలో ఎఫ్ ఐ ఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని,40 ఫిర్యాదులలో ఇతర శాఖలకు రాయడం జరిగింది అని, మహిళ , కుటుంబ సమస్యలను జిల్లా షీ టీమ్, సఖి సెంటర్ కి రాయడం జరిగింది అని,కొన్ని పిర్యాదులలో ఇరు వర్గాల వారిని పిలిపించి వారి సమస్యలను పరిష్కరించామని, సివిల్ సమస్య ఉన్న పిర్యాదులలో కోర్టు వెళ్లాలని సూచించమని, కోర్టు ని ఏ విధంగా సంప్రదించలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి ఓపికతో తమ ఫిర్యాదులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్న అర్జీదారులు.ఈ కార్యక్రమంలో సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News