మరోసారి కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన థమన్?

టాలీవుడ్ సంగీత దర్శకులలో చాలా మందిపై కాపీ క్యాట్ విమర్శలు ఉన్నాయి.

అయితే ఇతర సంగీత దర్శకులతో పోల్చి చూస్తే థమన్ పై ఈ విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

గతంలో థమన్ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల నుంచి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టాడని, కొన్నిసార్లు తన పాటలను తనే కాపీ కొట్టాడని విమర్శలు వినిపించాయి.అయితే గత కొంతకాలం నుంచి కొత్త బాణీలు ఇస్తూ జాగ్రత్త పడిన థమన్ వి సినిమా ద్వారా మరోమారు విమర్శల పాలవుతున్నారు.

వి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్ ఈ సినిమా విషయంలో కాపీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.నిజానికి వి సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించారు.

అయితే కొన్ని కారణాల వల్ల అమిత్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేనని చెప్పడంతో దర్శక నిర్మాతలు నేపథ్య సంగీతం కోసం థమన్ ను ఎంపిక చేసుకున్నారు.అయితే వి నేపథ్య సంగీతం తమిళ సినిమా రాచ్చసన్, అసురన్ సినిమాలను పోలి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

థమన్ ఈ రెండు సినిమాలతో పాటు గేమ్ ఆఫ్ థ్రోన్స్ 6వ సీజన్ లోని వైల్డ్ ఫైర్ మ్యూజిక్ ను కూడా కాపీ కొట్టాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అయితే మన సంగీత దర్శకులు కాపీ కొట్టినా ఆ విషయం అంగీకరించడానికి ఏ మాత్రం ఇష్టపడరు.

ఎవరైనా వి నేపథ్య సంగీతం కాపీ ఆరోపణల గురించి థమన్ ను సంప్రదిస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రస్తుతం థమన్ చేతిలో సర్కారు వారి పాట, వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటర్, టక్ జగదీష్, ఇతర సినిమాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు